తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ కోచింగ్ కేర్ సెంటర్లో 6వ ఫిట్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 26 బోగీల రైలుకు సరిపడే విధంగా 600 మీటర్ల పొడవుతో లైన్ను తయారు చేసినట్లు వెల్లడించారు. విడి బోగీలు ఉంచడానికి ఆరు స్టేబులింగ్ లైన్లు, విడి చక్రాలు, బోగీల పార్కింగ్ కోసం మరో లైను అందుబాటులోకి వచ్చిందన్నారు. సిబ్బంది చిత్తశుద్ధితో నిరంతరాయంగా శ్రమిస్తూ ప్రయాణికులకు రైళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...