అనకాపల్లిలో తెదేపా నాయకుల సమక్షంలో ఎమ్మెల్సీ, విశాఖ గ్రామీణ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు పలు అంశాలను వెల్లడించారు. పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను నిలిపివేయడం అన్యాయమని, చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా 73 పట్టణాలు నగరాల్లో ఒకేసారి 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తు చేశారు. రోజుకు సుమారు 3 లక్షల మంది ఈ క్యాంటీన్ ఫలహారం, భోజనాలు చేస్తుంటారు. పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న అన్నక్యాంటిన్లు తెరిపించికపోతే తెదేపా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పాలన మరిపించే రీతిలో ఉందన్నారు. పేద ప్రజలకు పనికొచ్చే పథకాలను ఆపేయడం అన్యాయమన్నారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు 45 ఏళ్లుగా పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారంలో హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు డాక్టర్ నారాయణ రావు , కొణతాల వెంకట్రావు, పలక సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీచూడండి.శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు