విశాఖ జిల్లా అనకాపల్లిలో కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న గవరపాలెం, నిదానందొడ్డి ప్రాంతాల్లోని రైతులు పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని.. ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వర్ రావు అధికారులను కోరారు.
అన్నదాతలు పొలం పనులు, పాడి పనులు చేసుకునేందుకు అనుమతించాలన్నారు. ఈ మేరకు జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్ ఫణి రామ్, సీఐ భాస్కర్ రావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.
ఇవీ చదవండి: