గిరిజన రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఆచార్య ఎన్.జీ. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుండడం అభినందనీయమని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విశాఖ ఏజెన్సీలో గిరి రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో సేంద్రీయ పంటలు పండిస్తున్నప్పటికీ కనీస మద్దతు ధరలు లభించక తీవ్రంగా నష్టపోయేవారని తెలిపారు. ఈ దశలో గిరి రైతులకు శాస్త్ర పరిజ్ఞానం అందించేందుకు ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఇవీ చూడండి...