విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏలో మహిళా రైతులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమావేశమయ్యారు. రైతులు పండించే పంటలను వందన కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. దీనివల్ల గిట్టుబాటు ధర వస్తుందని దళారుల చేతుల్లో మోసపోకుండా ఉంటారన్నారు.
ఏజెన్సీలోని 27 వందన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమం అనంతరం 200 విస్తర్ల కుట్టుమిషన్లు, సోలార్ పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. పాడేరు సుండ్రు పుట్టులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'రోలుగుంటలో నిరుపయోగంగా భవనాలు'