విశాఖ జిల్లాను ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నంలో పర్యటించిన ఆయన..లంబసింగి, తాండవ, కృష్ణదేవిపేట పట్టణాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరాన్ని రూ.50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటామన్న అవంతి... రాష్ట్ర ప్రయోజనాలకు కృషి చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ...