ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో పర్యటించి.. కరోనా నివారణ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాయకరావుపేట కంటోన్మెంట్ జోన్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలంతా తమకు సహకరించాలని.. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని కోరారు. అనంతరం వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు.
ఇవీ చదవండి.. భూములిచ్చిన రైతులు గురించి ప్రభుత్వానికి పట్టదా..?