విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఏపీ పర్యటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి..వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ ఈవో సూర్యకళ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: