ETV Bharat / state

'సమిష్టి కృషితోనే కరోనా నియంత్రణ' - Minister Avanti visit to Payakaraopeta

విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పులను రేషన్​ డిపోలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటన

author img

By

Published : Mar 30, 2020, 7:23 AM IST

పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటన

విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పులను రేషన్ డిపోలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్​-19 (కరోనా వైరస్) నివారణకు అధికారులంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: యాచకులకు ఆహార పొట్లాలు అందించిన తాడిపత్రి డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.