మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలనే ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో పథకాన్ని ప్రారంభించిన ఆయన.. జిల్లాలో 357 మంది లబ్ధిదారులున్నారని తెలిపారు. చేనేతలకు 85 లక్షల 68 వేల చెక్కులను అందజేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి ఒక్క నేతన్నకు ఏడాదికి 24 వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం మగ్గంపై వస్త్రం నేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ రావు, కలెక్టర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: