ETV Bharat / state

పాములు కనిపిస్తే ఆ యువకుడు పట్టి రక్షిస్తాడు..! - story on snake saver

పాములంటే ఆయనకు చాలా ఇష్టం... వాటి ప్రాణాలు కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ సర్పం కనిపించినా అతనికి ఫోన్​ వెళ్తుంది. చటుక్కున పట్టేస్తారు. సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఇదే ప్రవృత్తిగా పెట్టుకున్న పశ్చిమగోదావరి యువకుడు క్రాంతిపై ప్రత్యేక కథనం..!

west godavari man saving snakes
పాములను కాపాడుతున్న పశ్చిమ గోదావరి యువకుడు
author img

By

Published : Dec 21, 2019, 4:48 PM IST

పాములను కాపాడుతున్న పశ్చిమగోదావరి యువకుడు

పామును చూస్తే బెదిరిపోయి కిలోమీటరు పరిగెత్తేవారు కొందరైతే... దాన్ని చంపేవారు మరికొందరు. పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడేనికి చెందిన క్రాంతి మాత్రం సర్పాలను పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతాడు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని జనావాసాలు, ఇళ్లల్లో పాము కనిపిస్తే.. క్రాంతికి సమాచారం వస్తుంది. వెంటనే తన సరంజామాతో వెళ్లి.. పట్టుకొని అడవిలో వదిలేస్తాడు. ఎంతటి ప్రమాదకర పామైనా ఇట్టే పట్టేస్తాడు.

వృత్తి ప్రైవేటు ఉద్యోగం.. ప్రవృత్తి పాములు పట్టడం

చిన్నప్పటి నుంచి క్రాంతికి పాములంటే ఇష్టం... వాటిని చంపితే ఎంతో బాధపడేవారు. దాన్ని ఆపాలనుకునే పాములు పట్టడం ప్రారంభించాడు. ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తూనే పాముల సంరక్షణ చేపడుతున్నాడు. ఎక్కువ పాముకాట్లకు గురయ్యే ఆదివాసీ ప్రాంతాల్లో క్రాంతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. కృష్ణా జిల్లా దివిసీమ గ్రామాల్లోనూ చైతన్య సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పాము కాటువేస్తే.. ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయాలు వివరిస్తున్నాడు. స్నేక్ సేవర్ సొసైటీ ఏర్పాటు చేసి వేల పాముల ప్రాణాలు నిలుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పాముల సంరక్షణ వదల్లేదు. సర్పాలను కాపాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సాయం చేస్తున్నాడీ యువకుడు.

ఇదీ చదవండి:

జీఎన్‌ రావు కమిటీకి చట్టబద్ధత లేదు: రాజధాని రైతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.