గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇంకా ఉన్నారు: మంత్రి అవంతి - బోని గ్రామ వార్తలు
విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందపురం, శిర్లపాలెం, బోని పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. బోని గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిచ్చోళ్లు ఇంకా ఉన్నారని అన్నారు. వారి పేర్లు చెప్పడం సందర్భం కాదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లోనూ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వమే ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపాను అభ్యర్థులను గెలిపించాలని కోరారు.