తెదేపా నేత సబ్బం హరి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని... తప్పు చేస్తే ఏ ఒక్కర్నీ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. తన మీద పోటీ చేసి ఓడిపోయిన సబ్బం హరి గురించి ఎవరూ పట్టించుకోరని ముత్తంశెట్టి వ్యాఖ్యానించారు. ఆయన గురించి ఆయనే ఎక్కువగా ఊహించుకుని.. ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఓ నాయకుడి మీద భూ ఆక్రమణల ఆరోపణలు వస్తే పార్టీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.
విమర్శలు చేస్తే.. మూల్చం చెల్లించుకోక తప్పదు
సబ్బం హరి సీతమ్మధారలోని తన ఇంటి దగ్గర 3 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని.. దానినే జీవీఎంసీ వారు కూల్చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఎంతటి వారైనా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కుల్చి వేస్తామని తెలిపారు. వైకాపా నాయకులపై విమర్శలు చేస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని ధర్మ శ్రీ చెప్పారు.
ఇదీ చదవండి: