ETV Bharat / state

కాజీపేట - బల్హార్షా సెక్షన్ ఆధునీకరణ: రైళ్ల మళ్లింపు - changes of south indian railway routes

రైల్వే లైన్ల ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రాఘవాపురం - కొలనూర్‌ స్టేషన్ల మధ్య మూడో లైన్‌కు సంబంధించి నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు నిర్వహిస్తున్నామని సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి చెప్పారు.

middle south indian railway
దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Oct 6, 2020, 3:40 PM IST

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కీలకమైన కాజీపేట - బల్హార్షా సెక్షన్‌ ఆధునికీకరణ పనులు జరుగుతున్న కారణంగా... కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. రాఘవాపురం - కొలనూర్‌ స్టేషన్ల మధ్య మూడో లైన్‌కు సంబంధించి నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

దారి మళ్లించిన రైళ్లు:

1) పూరీ - ఓఖా ప్రత్యేక రైలు

  • 11న పూరీలో బయలు దేరనున్న పూరీ-ఓఖా (08401) ప్రత్యేక రైలు
  • 7, 14 తేదీల్లో ఓఖాలో బయలు దేరనున్న ఓఖా-పూరీ (08402) ప్రత్యేక రైలు, పూరీలో బయలు దేరనున్న పూరీ-అహ్మదాబాద్‌ (08407) ప్రత్యేక రైలు
  • 10న అహ్మదాబాద్‌లో బయలు దేరనున్న అహ్మదాబాద్‌-పూరీ (08408) ప్రత్యేక రైళ్లు

పాత మార్గానికి బదులుగా ఖుర్దారోడ్‌, బ్రహ్మపుర, విజయనగరం, రాయపూర్‌, గండియి, నాగ్‌పూర్‌, బడ్నెర మీదుగా ప్రయాణం సాగించనున్నట్లు తెలిపారు.

2) విశాఖ - న్యూ దిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైలు

ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు విశాఖ-న్యూదిల్లీ-విశాఖ (02805-02806) ప్రత్యేక ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పాతమార్గానికి బదులుగా వయా ఉత్తర సింహాచలం, విజయనగరం, రాయగడ, టిట్లాఘర్‌, రాయపూర్‌, గండియ, నాగ్‌పూర్‌ మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు పేర్కొన్నారు.

3) మరిన్ని రైళ్లు...

  • 10, 12 తేదీల్లో ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-చప్రా (02669) ఎక్స్‌ప్రెస్‌,
  • 7, 12, 14 తేదీల్లో చప్రా-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (02670) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళు
  • 12న కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌ సిటీ-దనాపూర్‌ (06509) ఎక్స్‌ప్రెస్‌
  • 7, 14 తేదీల్లో దనాపూర్‌-బెంగళూర్‌ సిటీ (06510) ప్రత్యేక రైళ్లు
  • 7 నుంచి 15 వరకు త్రివేండ్రం-న్యూ దిల్లీ-త్రివేండ్రం (02625-02626) ప్రత్యేక రైళ్లు
  • 10న కోయంబత్తూరు నార్త్‌- పటేల్‌నగర్‌ (00651)పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌,
  • 7, 14 తేదీల్లో పటేల్‌ నగర్‌- కోయంబత్తూరు (00652) పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌,
  • 7, 9, 14 తేదీల్లో కె.ఎస్‌.ఆర్‌ బెంగళూర్‌ సిటీ- హజ్రత్‌ నిజాముద్దీన్‌(00621) పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌
  • 10, 12 తేదీల్లో హజ్రత్‌ నిజాముద్దీన్‌-కె.ఎస్‌.ఆర్‌. బెంగళూర్‌ సిటీ(00622) పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

పాత మార్గానికి బదులుగా వయా విజయవాడ, దువ్వాడ, సింహాచలం నార్త్‌, విజయనగరం, రాయగడ, టిట్లాఘర్‌, రాయపూర్‌, గొండియ, నాగ్‌పూర్‌ మీదుగా ప్రయాణం సాగించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

లైవ్​ అప్​డేట్స్​: కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.