గ్రామాల్లో రైతుభరోసా కేంద్రం ద్వారా సంపద వృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ వై.సింహాచలం వెల్లడించారు. గ్రామ, మండల స్థాయిలోని పశువైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి పశువైద్యశాలలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశు వైద్య నిపుణులతో పశువులకు సంబంధించిన వ్యాధులపై అవగాహణ కల్పించారు. గర్భకోశ వ్యాధులు, శస్త్ర చికిత్సలు, దీర్ఘకాలంగా వేధిస్తున్న వ్యాధులకు సంబంధించి చికిత్స, సలహాలు ఇచ్చారు. ఈ సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: మంత్రి నానిపై భగ్గుమన్న భాజపా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు