ETV Bharat / state

విశాఖలో రామ్​చరణ్ సందడి.. ఎంత స్టైలిష్​గా హెలికాప్టర్ దిగుతున్నాడో.. - గీతంలో రామ్​ చరణ్ మూవీ షూటింగ్

RC15 Movie Shooting in Visakhapatnam: సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విశాఖలో సందడి చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా గీతం కళాశాలకు వచ్చారు. సినిమా చిత్రీకరణకు సంబందించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థులు షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని తమ అభిమాన నటుడిని చూసి కేరింతలు కొట్టారు.

Mega Powerstar Ram Charan
రామ్​చరణ్
author img

By

Published : Feb 13, 2023, 11:02 AM IST

విశాఖలో రామ్‌చరణ్‌ సందడి

RC15 Movie Shooting in Visakhapatnam: టాలీవుడ్​ మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్,​ స్టార్ డైరెక్టర్​ శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్​సీ 15'. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శరవేంగా షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను విశాఖలో జరుగుతోంది. విశాఖలోని గీతం కళాశాలకు వచ్చారు. చుట్టూ డాన్సర్ల మధ్య హెలికాప్టర్​ నుంచి రామ్​చరణ్ దిగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. షూటింగ్​ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు.

కాగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ కర్నూలులో జరిగింది. కర్నూల్​లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఆ సమయంలో కూడా అభిమానులు భారీగా గుమిగూడారు. అంతకు ముందు హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద​ షూటింగ్​ చేసిన మూవీ టీమ్​ ఇప్పుడు విశాఖ​లో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్​ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్​గా రూపొందుతోంది 'ఆర్​సీ15'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్​. జె. సూర్య, నవీన్​ చంద్ర, సునీల్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా షూటింగ్​కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇటీవలే మళ్ళీ కొత్త షెడ్యూల్​ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా వివిధ ప్రాంతాలలో షూటింగ్స్ చేస్తూ.. చిత్రయూనిట్ వేగం పెంచింది. రామ్​చరణ్​, దిగ్గజ దర్శకుడు శంకర్​ కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.