విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో గల మాంసం, చేపలు విక్రయదారులు మేయర్, డిప్యూటీ మేయర్లను ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం రోజు మాంసం, చేపలు విక్రయించే దుకాణాలు మూసివేయాల్సిందిగా జీవీఏంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై.. పునరాలోచించాలని వారు కోరారు. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే అనేక ఇబ్బందులుకు గురి అవుతున్నామని... ఆ రోజు జరిగే వ్యాపారం వల్ల కాస్తో కూస్తో తమకు ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఆదివారం నాడు దుకాణాలు మూసివేయలనే ఆదేశాలు వెనక్కి తీసుకుని తమ వ్యాపారానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని వారిని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి. నిండు గర్భిణి కూర్మాసనం.. ప్రపంచ రికార్డు సొంతం!