విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మృతి చెందినన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రమే మృతదేహాలను ఆస్పత్రికి తీసుకురాగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి మీడియాను అనుమతించలేదు. కోర్టు మార్గదర్శకాల దృష్ట్యా మృతదేహాలకు కరోనాతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి : Kgvb: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు