
మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్‌జడ్‌సీ కార్యదర్శి గణేష్.. ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధానిలో నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం పది సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి... ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆగ్రహించారు.

ఆరేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం, సహజ వనరులను ప్రైవేటీకరించడం, విద్యా, వైద్యాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:
రామతీర్థం చుట్టూ రాజకీయం.. విగ్రహ ధ్వంసం ఘటనాస్థలానికి నేడు అగ్ర నేతలు