ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోగల ఒనకఢిల్లీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్​ను కూంబింగ్ బలగాలు కనుగొన్నాయి. కోరాపుట్టు, మల్కాన్​గిరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కోరాపుట్టు డీవీఎఫ్, బీఎస్​ఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ కూంబింగ్​లో మావోయిస్టు డంప్​ను గుర్తించారు. డంప్​లో భారీగా పేలుడు సామాగ్రి, మావోయిస్టులు ఫొటోలు, విప్లవ సాహిత్యం ఉన్నాయని కోరాపుట్టు ఎస్పీ తెలిపారు.

Maoist dump
Maoist dump
author img

By

Published : Oct 19, 2020, 6:13 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోగల ఒనకఢిల్లీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ను కోరాపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్టు ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌ బమ్ము తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం కోరాపుట్టు, మల్కాన్‌గిరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. కోరాపుట్టు డీవీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్​లో పాల్గొన్నాయి.

బోడోడురాయిల్‌ పంచాయతీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన డంప్‌ను బలగాలు కనుగొన్నాయి. ఈ డంప్‌లో పేలుడు పదార్థాలు 18, జిలిటెన్‌ స్టిక్స్ 500, కెమెరా ఫ్లాష్‌లు 3, విద్యుత్తు తీగ15 మీటర్లు, స్పిల్టంర్‌ 1200 గ్రాములుతో పాటు మావోయిస్టులకు చెందిన కొన్ని ఫొటోలు, విప్లవ సాహిత్యం ఉన్నాయి. గిరిజనులు తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎవ్వరూ మావోయిస్టులకు సహకరించడంలేదని ఎస్పీ ముఖేశ్ కుమార్ బమ్ము తెలిపారు.

ఇదీ చదవండి :

ఆడపిల్లగా పుట్టింది... మగరాయునిగా బతికింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.