ETV Bharat / state

విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తి అరెస్టు - పోలీసుల అదుపులో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితుడు

మాదక ద్రవ్యాలను విద్యార్థులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ బీచ్​ రోడ్​లో అదుపులోకి తీసుకున్న నిందితుడి నుంచి 5 ఎల్ఎస్​డీ బ్లాట్​లు, 199.19 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

man was taken into custody selling drugs to students in vishakapatnam
పోలీసుల అదుపులో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితుడు
author img

By

Published : Sep 10, 2020, 5:55 PM IST

మాదక ద్రవ్యాలను విద్యార్ధులకు అమ్మేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని లాసన్స్ బే కాలనీకి చెందిన సరిపల్లి వర్మరాజు... బీచ్ రోడ్డులో.. తెన్నేటి పార్కు వద్ద మాదక ద్రవ్యాల ప్యాకెట్లను విక్రయించేందుకు వేచిచూస్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని నుంచి 5 ఎల్ఎస్​డి బ్లాట్ లు, 200 మిల్లీ గ్రాముల ఏడీఎంఎ కెప్టెన్ గోగొ ప్లస్ టిప్స్ ఓసీబీ షీట్లు, ఒక చరవాణి, హోండ్ యాక్టివా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ మూర్తి తెలిపారు. 199.19 గ్రాముల గంజాయి, 8 చిన్న జిప్ లాక్ బ్యాగులను సీజ్ చేశామన్నారు.

ఇదీ చదవండి:

'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.