ETV Bharat / state

వివాహేతర సంబంధం...ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి - crime news in vizag district

విశాఖపట్నం జిల్లా దోసలపాడులో దారుణహత్య జరిగింది. వివాహేతర సంబంధం విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man killed in dosalapadu vizag district
వివాహేతర సంబంధం విషయంలో ఘర్షణ : వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Jan 2, 2021, 6:24 PM IST

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడులో హత్య జరిగింది. మండలంలోని ముకుందరాజుపేట గ్రామానికి చెందిన ఎరుకొండ రమణ అనే వ్యక్తికి, దోసలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. శుక్రవారం రాత్రి మహిళ వద్దకు వెళ్లిన రమణ... ఆమెకు మరొకరితో చనువు ఉందన్న అనుమానంతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి, రమణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన యువకుడు...రమణను కర్రతో కొట్టటంతో అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై వెల్లడించారు.

ఇదీచదవండి.

'భర్త ఉంటే భార్య ఉండకూడదు.. భార్య ఉంటే భర్త ఉండకూడదంట సార్..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.