ETV Bharat / state

'అమ్మఒడి' డబ్బు బుడ్డీకి ఇవ్వలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త.. - విశాఖ జిల్లా నేర వార్తలు

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన విశాఖ మన్యంలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

murder in vishaka agency
murder in vishaka agency
author img

By

Published : Jan 13, 2021, 7:04 PM IST

విశాఖ జిల్లా అనంతగిరి మండలం బురదగెడ్డలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు 'అమ్మ ఒడి' డబ్బులు ఇవ్వనందుకు భార్యను చంపాడు ఓ కిరాతకుడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గ్రామంలో తామల దేవుడమ్మ(36), భీమయ్య దంపతులు ఉంటున్నారు. 'అమ్మ ఒడి' పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే నగదు దేవుడమ్మ అకౌంట్​లో జమయ్యాయి. బుధవారం గుమ్మకోట సంత ప్రాంతానికి వెళ్లి తన అకౌంట్​లోని నగదును ఆమె తీసుకుంది. అనంతరం మద్యం తాగేందుకు తనకు ఆ డబ్బులు ఇవ్వాలంటూ భార్య వెంటపడ్డాడు భీమయ్య. ఆమె ఒప్పుకోకపోవటంతో దారిపొడవునా కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘర్షణలో ఆమె మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో భీమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

యాప్​లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.