విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన పైల శ్రీను అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మృతుడు శ్రీనుతో పాటు మరి కొంత మంది చెట్లు నరకడానికి వెళ్లారు. దీనిలో భాగంగానే పంచాయతీ శివారు బాగాపురం వద్ద సరుగుడు చెట్లు నరుకుతుండగా.. అక్కడే తెగిపడిన విద్యుత్ తీగపై శ్రీను అడుగులు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు