విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పలు ప్రధాన రహదారుల్లో తుప్పలు దట్టంగా ఉన్నాయి. వర్షాలకు మరింత ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ఆయన స్వగ్రామం తారువలో ప్రజలతో కలిసి రోడ్డు పక్కన తుప్పలను పెద్ద ఎత్తున తొలగించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సోమవారం కొత్తపెంట నాయకులు, ప్రజలు ఆ గ్రామంలోని రోడ్డుపై ఇరువైపులా తుప్పలను తొలగించారు. తాజాగా బోయిలకింతాడ, మామిడిపల్లి గ్రామస్థులు, నాయకులు పెద్ద ఎత్తున శ్రమదానంతో తుప్పలను తొలగించి ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చదవండి