ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ప్రమాదాలను మరువక ముందే విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని రామ్ కీ కంపెనీకి చెందిన విశాఖ సాల్వెంట్స్ సంస్థలో రియాక్టర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టూ ఫార్మా సంస్థలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఆకాశాన్ని తాకేంతగా అగ్నికీలలు ఎగిసిపడటంతో...ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకూ అగ్నిమాపక సిబ్బందికి వీలుకాలేదు. ఎట్టకేలకు శ్రమించి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. మొత్తం మూడు రియాక్టర్లలో ఒకటి పేలి మంటలు వ్యాపించగా....మిగిలిన రెండు ట్యాంకుల్లోని సాల్వెంట్ అగ్నికి ఆహుతైంది. మిథనాల్ సాల్వెంట్‌ను ఆ ట్యాంకుల్లో స్టోర్ చేసి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమయంలో మొత్తం నలుగురు సిబ్బంది అక్కడ ఉండగా.....ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. మనీష్ అనే కెమిస్ట్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరందరికీ గాజువాకలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్డీవో కిషోర్, డీసీపీ సురేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ వినయ్ చంద్ పరిస్థిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించ లేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. తమవారి ఆచూకీ కోసం బంధువులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు.
ఇదీచదవండి