ETV Bharat / state

నేతల ప్రచారాలతో హోరెత్తిన మహానగరం విశాఖ

మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రధాన పార్టీల్లోని ముఖ్యనేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మంత్రుల నుంచి మొదలు.. వార్డు నేతల వరకూ.. అంతా ఓటర్లను కలుస్తూ.. గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ministers campaigns in muncipal elections
నేతల ప్రచారాలతో హోరెత్తిన మహానగరం
author img

By

Published : Mar 7, 2021, 8:02 AM IST

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాలపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. 91, 92, 89, 90 వార్డుల్లో ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వైకాపా అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయసాయిరెడ్డితోపాటుగా ఎంపీ ఎంవీ సత్యనారాయణ, మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కర్ రావులు ర్యాలీలో పాల్గొని.. వైకాపాకు ఓటు వేసి సీఎం జగన్​కు మద్దతు ప్రకటించాలని కోరారు.

మంత్రి అవంతి సమక్షంలో చేరికలు..

సింహాచలంలో మంత్రి అవంతి సమక్షంలో వైకాపాలోకి భారీగా కార్యకర్తలు చేరారు. తెదేపా మద్దతుదారులుగా ఉన్న విజినిగిరి పాలెంలో రైతులు, రైతు కుటుంబాలు వైకాపా సంక్షేమ పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరటం ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజల కోసమే అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 98 వార్డు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో మంత్రి సీదిరి అప్పలరాజు..

మంత్రుల రాకతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రచారాలతో హోరెత్తుతోంది. పశు సంవర్ధక, పాడి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రచారం..

జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా కార్పొరేట్ అభ్యర్థులను గెలిపిస్తే విశాఖకు ధీటుగా అనకాపల్లిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనకాపల్లిలో 83వ వార్డు వైకాపా కార్పొరేట్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మీని గెలిపించాలని కోరారు. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు వైకాపాకు మద్దతివ్వాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు దాడి రత్నాకర్ విజ్ఞాప్తి చేశారు.

అనకాపల్లి శాసనసభ్యులు అమర్​నాథ్ ఎన్నికల ప్రచారం..

విశాఖను పరిపాలన రాజధానిగా ఓప్పుకోని పెద్ద మనుషులు.. ఎలా నగరంలో పర్యటిస్తున్నారని అనకాపల్లి శాసనసభ్యులు అమర్​నాథ్ అన్నారు. పట్టణంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే.. అడ్డుకున్న తెదేపా నేతలు ఇప్పడెలా ఓట్లు అడుకుతున్నారని ప్రశ్నించారు. విశాఖ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్​లకు లేదని అమర్​నాథ్ దుయ్యబట్టారు.

వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం..

నగరంలోని 21వ వార్డులో వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ముస్లింలు ఘన స్వాగతం పలికారు. చినవాల్తేర్ మెయిన్ రోడ్, మసీదు రోడ్, సీబీఐ డౌన్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్​లు ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

జనసేన - భాజపా ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం..

మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా జనసేన - భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. కులాలు, మతాలు ప్రస్తావన లేని రాజకీయానికి పెద్ద పీట వేయాలని అభ్యర్థులను కోరారు. 27వ వార్డు జనసేన - భాజపా ఉమ్మడి అభ్యర్థి ఆదిమూలం శారణి దేవి పాదయాత్ర నిర్వహించారు. 44వ వార్డు జనసేన- భాజపా ఉమ్మడి అభ్యర్థి బొడ్డేటి కృష్ణరామరాజు పాదయాత్ర చేపట్టి.. గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో పోలీసుల దాడులు.. భారీగా గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.