కరోనా నేపథ్యంలో విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు కోరారు. రోజూ అమ్మవారి దర్శనార్ధం జిల్లా వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆదివారం గుడిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మాడుగులలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. నేటి నుంచి 10 రోజులపాటు భక్తులెవరూ ఆలయానికి రావొద్దని కోరారు.
ఇవీ చదవండి...
మీరందరూ త్వరగా కోలుకుని మళ్లీ విధుల్లో చేరాలి: ఎస్పీ రవీంద్రనాథ్