విశాఖ జిల్లా మాడుగుల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రామారావు మృతి చెందారు. కరోనా సోకడం వల్ల ఆయన గత కొద్ది రోజులుగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
బుధవారం పరిస్థితి విషమించి మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రామారావు మృతికి మాడుగుల తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ గవిరెడ్డి రామానాయుడు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటన్నారు.
ఇదీ చదవండి: