విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణాపురంలో గుట్టు చప్పుడు కాకుండా నాటుసారా తయారీ చేస్తున్న బట్టీలపై మాడుగుల ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు జరిపారు. సీఐ బి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
సారా తయారికి ఉపయోగించే బెల్లం ఊటను 2 వేల లీటర్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బెల్లం ఊటను... సారా తయారికి ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: