గత ఐదేళ్లుగా నూతన సంవత్సర వేడుకల వల్ల ..గ్రీటింగ్ కార్డులు వ్యాపారులు సన్నగిల్లుపోతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపడంతో.. ఒకరికొకరు సంభాషించుకోవడమే మానేశారు. కొత్త సంవత్సరం వస్తే... గ్రీటింగ్‌లు, డైరీలు, పుష్పగుచ్ఛాలు .. కొంటూ మార్కెట్ అంతా సందడిగా మారేది. ఇప్పుడు ఆ జనమే లేరు. మనిషి కదలకుండానే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.
విశాఖ మన్యం పాడేరులో గ్రీటింగ్ కార్డుల మార్కెట్ బాగా పడిపోయింది. పుష్పగుచ్చాలు, గ్రీటింగ్ కార్డులు, డైరీలు కొనకపోవడంతో పుస్తక దుకాణాలు వెలవెలబోతున్నాయి. పళ్ల వ్యాపారాలు అంతంతా మాత్రంగానే సాగుతున్నాయి. ఫ్యాన్సీ దుకాణాల వద్ద కొత్త వస్తువులు కొనేవారు కనుమరుగయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పెరగడంతో వీటి ప్రభావం చిరు వ్యాపారాల మీద పడింది.
ఇదీ చూడండి. ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్ : సుచిత్ర ఎల్ల