అనకాపల్లిలో దుకాణాలు తెరిచే విషయాన్ని రెండు రోజుల క్రితం స్థానిక వ్యాపారులు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దృష్టికి తీసుకొచ్చారని, ఆయన స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కొన్ని దుకాణాలు మినహాయించి మిగతా వాటిని తెరచుకొనేలా అనుమతులు ఇచ్చారని వైకాపా పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు తెలిపారు. అనకాపల్లిలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా రాకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపారని, రాబోయే రోజుల్లో నిబంధనలు పాటిస్తూ దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహించాలని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు సూచించారు.
ఇవీ చూడండి...