ETV Bharat / state

నాటుసారా తనిఖీల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడి - paderu latest news

నాటుసారా ఉందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై స్థానికులు దాడిచేసిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది. ఈ దాడి నుంచి ఓ కానిస్టేబుల్ తప్పించుకోగా, మరొకరిని నిందితులు అటకాయించి, సెల్​ ఫోన్, పర్సు తీసుకున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

నాటుసారా తనిఖీల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడి

author img

By

Published : Sep 14, 2020, 11:07 PM IST

నాటుసారా తనిఖీల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడి

విశాఖ జిల్లా పాడేరులోని ఓ ఇంట్లో నాటుసారా ఉందన్న సమాచారంతో తనిఖీకి వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడి జరిగింది. పాడేరులోని బక్కల పనుకు వీధిలోని ఇళ్లలో నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తనిఖీలకు వెళ్లారు. ఇళ్లలో సోదాలు చేస్తుండగా నాటుసారా పోలీసుల కంటపడింది. వీడియోలు తీస్తుండగా స్థానికులు వారిపై దాడి చేశారు.

ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ తప్పించుకోగా, మరో కానిస్టేబుల్​ను నిందితులు అటకాయించారు. తన వద్ద ఫోన్, పర్సు తీసుకున్నారని కానిస్టేబుల్ తెలిపారు. ఆయన పాడేరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిని స్టేషన్​కు తీసుకొచ్చి ప్రశ్నించారు. కానిస్టేబుల్​ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.