ETV Bharat / state

విశాఖ-కడప-విశాఖ ఎక్స్​ప్రెస్​కు అత్యాధునిక ఎల్​హెచ్​బి కోచ్​లు - LHB coaches for visakha trains news

విశాఖ-కడప-విశాఖ ఎక్స్​ప్రెస్​కు అత్యాధునిక ఎల్​హెచ్​బి కోచ్​ల సదుపాయాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. ఈనెల 15 నుంచి ఈ కోచ్​లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు.

LHB coaches
అత్యాధునిక ఎల్​హెచ్​బి కోచ్​లు
author img

By

Published : Feb 8, 2021, 4:45 PM IST

విశాఖ-కడప-విశాఖ ఎక్స్​ప్రెస్​కు సంప్రదాయ కోచ్​ల స్థానంలో ఎల్​హెచ్​బి కోచ్​లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఈ కోచ్​లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. జర్మన్ సాంకేతికతతో తయారైన ఈ ఆధునిక కోచ్​లలో సీటింగ్, ఇతర సదుపాయాలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ఇవి తక్కువ బరువుతో ఉండి.. ఎక్కువ వేగంగా ప్రయాణించేందుకు సులువుగా ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం వాల్తేర్ డివిజన్​లో విశాఖ-కొత్తదిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్​ప్రెస్​, విశాఖ-కొర్బా-విశాఖ ఎక్స్​ప్రెస్​లలో ఈ కొత్త కోచ్​లు ఉన్నాయి. 0748​ నెంబర్​తో ప్రయాణించే విశాఖ-కడప ప్రత్యేక రైలు, 07887 నెంబర్​తో ఉన్న కడప-విశాఖ రైలుకి ఈ కోచ్​లు అందుబాటులోకి వస్తాయి. 22 ఎల్ హెచ్​బి కోచ్​లలో రెండు సెకెండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ కోచ్​లు, 12 స్లీపర్ క్లాస్, మూడు సెకెండ్ క్లాస్, దివ్యాంగుల కోచ్ ఒకటి, జనరల్ మోటార్ కార్ ఇందులో ఉంటాయి. ఈ ఏడాదిలో మరిన్ని రైళ్లకు ఎల్​హెచ్​బి కోచ్​లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.