ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ 50 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది. స్టైరీన్ లీకేజ్ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా.. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. పలువురు ఇప్పటికీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీకేజ్‌పై పరిణామాలను, జీవ, జంతు జాలానికి జరిగిన నష్టాన్ని.. దీర్ఘకాలిక సమస్యలపైనా.. ఎన్జీటీ పరిశీలించి ఏ రకమైన చర్యలు చేపట్టాలన్నది నిర్ణయించనుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఇచ్చిన నిధులను బాధిత గ్రామాల కోసం వెచ్చించనున్నారు.
ఇదీ చదవండి: కరోనా 'దండోరా'... కర్ణాటకలో అడుగుపెట్టొద్దు..!