ETV Bharat / state

పలు ప్రాంతాల్లో వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభం

రాష్ట్రంలో పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు హామీ పత్రాలను అందజేశారు.

Launched ysr  asara scheme
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభం
author img

By

Published : Sep 15, 2020, 6:16 PM IST

విశాఖ జిల్లాలో..

ప్రభుత్వం హామీలన్నీ 90 శాతం అమలు చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన వైఎస్సార్ ఆసరా హామీ పత్రాలను పంపిణీ చేశారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా పుత్తూరు మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఆమె అన్నారు. నియోజకవర్గంలోని 4634 గ్రూపులకు రూ. 45 కోట్లు మొదటి విడత కింద చెల్లించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా పరిగిలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో మంత్రి శంకర్ నారాయణ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వైయస్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కులమతాలు, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. పరిగి మండలంలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళా సంఘాలకు మొదటి విడతలో 8 కోట్ల 25 లక్షల రూపాయలు... లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రిపై ప్రజల ఆదరాభిమానాలు పెరుగుతూ ఉండడం చూసి ఓర్వలేక తెదేపా నాయకులు.. బురద చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు. ఇది మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి. రాజకీయ కక్షతోనే అమరావతిపై దుష్ప్రచారం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.