ETV Bharat / state

విశాఖ మన్యంలో జోరుగా వర్షం.. స్తంభించిన జనజీవనం - heavy rain in lambasingi

విశాఖ మన్యంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లంబసింగి ఘాట్​రోడ్డులో కొండచరియలు విరిగి పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. తురపాడ గెడ్డ పొంగిపొర్లుతున్నందున.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరు వాన
author img

By

Published : Sep 12, 2019, 4:56 PM IST

లంబసింగి రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తాకిడికి గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో పది రోజులుగా ఎడతెరిపిలేన వాన కురుస్తోంది. లంబసింగి ఘాట్​ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం - భద్రాచలం రహదారిలో గల తురపాడ గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు కనుమల మీదుగా ఒడిశా, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రవాహం ఇబ్బంది కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో ఓ వంతెన నిర్మించాలని ఎప్పటినుంచో డిమాండ్​ వినిపిస్తున్నా.. ప్రభుత్వం విస్మరిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇంకొన్ని రోజులు విశాఖ మన్యంలో జోరుగా వర్షం పడే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి...

కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షం

Intro:Ap_knl_51_10_moharam_av_AP10055

S.sudhakar, dhone

కర్నూల్ జిల్లా డోన్ లో మొహారం వేడుకలు ఘనంగా జరిగాయి. డోన్ పట్టణం తో పాటు చనుగొండ్ల, ఓబుళాపురం గ్రామాలలో భక్తి శ్రద్ధలతో పీర్లను నిమజ్జనం చేశారు. వారం రోజులు కొలువైన పీర్లు పూజలు అందుకొని భక్త జనుల సందోహంతో పీర్లు నేడు నిమజ్జనంకు తరలివెళ్ళాయి. మొహారం సందర్బంగా ఆయా గ్రామాలలో ప్రత్యేక వేశధారణలు, గుణ్ణం చుట్టూ చిందులు వేస్తూ ప్రజలు ఆనందపడ్డారు. పల్లెల్లో మొహారం పండుగ ఒక ప్రత్యేకత ఉంటాయి.Body:మొహారం వేడుకలుConclusion:Kit no.692, cell no.9393450169.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.