ETV Bharat / state

విశాఖలో సర్కారుకు భూముల పంట!

పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వానికి విలువైన భూములు ఉన్నట్లు గుర్తించారు. బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్ మిషన్ కింద ప్రభుత్వం చేపట్టిన వివరాల సేకరణలో సుమారు 4వేల ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటిని నిధుల సేకరణ నిమిత్తం విక్రయిస్తారా లేక....రాజధాని అవసరాల కోసం ఉంచుతారా అన్నది ఆసక్తిగా మారింది.

విశాఖలో సర్కారుకు భూముల పంట!
విశాఖలో సర్కారుకు భూముల పంట!
author img

By

Published : Feb 3, 2020, 4:57 AM IST

బిల్ట్‌ ఏపీ మిషన్‌ కింద ప్రభుత్వ భూముల వివరాల సేకరణ కొనసాగుతోంది. పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ నగరం చుట్టుపక్కల సుమారు 4వేల ఎకరాల విలువైన సర్కారు భూములున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర జిల్లాల్లో కంటే విశాఖలోనే విలువైన భూములు ఎక్కువగా ఉన్నాయి. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ శివారు మండలాల్లో భారీగా భూములను విక్రయించగా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం గుర్తించిన 4వేల ఎకరాలకూ మంచి డిమాండే ఉంది. వీటిలో అభ్యంతరాలు, కోర్టు కేసులు లేని వాటిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

‘నాడు- నేడు’ వంటి సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం బిల్ట్‌ ఏపీ మిషన్‌ను ఏర్పాటు చేసింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ భూముల అమ్మకం విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

ఎక్కెడెక్కడ భూములున్నాయంటే

విశాఖ నగరం, చుట్టుపక్కల 11 మండలాల్లో దాదాపు 2 వేల ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జీవీఎమ్​సీ పరిధిలో 350 ఎకరాలు, వీఎమ్​ఆర్​డీఏ పరంగా మరో 1700 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో నిరూపయోగంగా ఉన్న భూములు సైతం గుర్తించారు. విశాఖ గ్రామీణ మండలంలో 900 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, అనకాపల్లిలో వెయ్యి ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని సీతమ్మదారలో 40 ఎకరాలు , ములగాడలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సబ్బవరం, పెదగంట్యాడ, పరవాడ,గోపాలపట్నం, భీమునిపట్నం మండలాల్లోనూ భూములున్నాయి.

సీతమ్మదార, రేసపువానిపాలెం ప్రాంతాల్లో ప్రభుత్వ, ఐటీ కార్యాలయాలకు కేటాయించిన భూముల్లో కొంతమేర నిరూపయోగంగా ఉన్నాయి. అయితే ఇవి అమ్మకానికి అంతగా పనికిరావని భావిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని హనుమంతవాకకు సమీపంలోని పశుసంవర్థకశాఖకు చెందిన 30 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు.

ఇవీ చదవండి

'కేసుల భయంతోనే కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.