విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 100 మీటర్లకు చేరుకుంది. దీనితో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరి కొద్ది గంటల్లో వరదనీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేయనున్న నేపథ్యంలో.. దిగువ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలోకి ఎవరూ దిగవద్దని హెచ్చరిక జారీ చేశారు.
ఇదీ చదవండి: 'మరణం మనిషికే కానీ మంచితనానికి కాదు'