విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయంలో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన వ్యక్తి సింగం కళ్యాణం (49) మృతి చెందాడు. గల్లంతైన అతని మృతదేహం గురువారం లభ్యమైంది. మూడు రోజులుగా స్థానికులు నాటు పడవలపై చేపల వలలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సింగం మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. అతడికి ముగ్గరు పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ఘటనపై ఎస్సై సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: