జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ ఐదు రోజులుగా మూసి ఉంది. తిరిగి మార్కెట్ ను తెరిపించాలని కోరుతూ ఆర్డీవోకు కొలగార్ల సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని అనకాపల్లి బెల్లం మార్కెట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వ్యాపారులు, కొలగార్లకు మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకులు బాలకృష్ణ కోరారు. మార్కెట్ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: