kodi kathi sreenu hunger strike in prison: కోడి కత్తి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ విశాఖ కేంద్రకారాగారంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక జనుపల్లి శ్రీనివాస్ దీక్షకు మద్దతు ప్రకటించింది. విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక తరపున జైల్లో శ్రీనివాస్‌తో డాక్టర్ బూసి వెంకట్రావు ములాఖత్ అయ్యారు.
ఉదయం అల్పాహారం తీసుకోలేదు: శ్రీనుతో ములాఖత్ అనంతరం డాక్టర్ బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. జైలోనే శ్రీనివాస్ నిరాహారదీక్ష చేస్తున్నట్టు తనతో చెప్పాడని వెంకట్రావు వెల్లడించారు. ఈ ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదని, తన దీక్షకు భగ్నం కలగకుండా కావలసిన అనుమతులు ఇప్పించాలని కోరుతునట్టు చెప్పారు. ఐదేళ్లుగా ప్రయత్నాలు చేసినా కరగని సీఎం, కనీసం ఈ ప్రయత్నం తోనైనా మనసు కరుగుతుందని భావిస్తునట్టు కోడికత్తి శ్రీను చెప్పారన్నారు. శ్రీను దీక్షకు, రాష్ట్రంలోని దళిత సంఘాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తమ మద్దతును ఇప్పటికే తెలియజేశాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనస్సు కరిగి కోర్టుకు రావాలని బూసి వెంకట్రావు తెలిపారు.
కోడికత్తి శ్రీను బెయిల్ కోసం పోరాటానికి సిద్ధమవుతున్న దళిత సంఘాలు
న్యాయం కోసమే ఆమరణ నిరహార దీక్ష: పోలీసు అనుమతులు లేని కారణంగా కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నా ప్రాణాలు పోయిన నా కొడుకు కోసం న్యాయం కోసమే నా ఆమరణ నిరహార దీక్ష అని శ్రీను తల్లి స్పష్టం చేసింది. ఈనెల 12న విజయవాడ ధర్నా చౌక్ లో దీక్షకు పోలీసు అధికారులను అనుమతి కోరగా అనుమతులు ఇవ్వనందున ఇంట్లోనే దీక్ష చేపట్టామని తెలిపారు. ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని జైల్లో నిర్బంధించి ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహమని కోడి కత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేసారు. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. మాకు మా కుటుంబానికి దళిత, మైనారిటీ ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
జగన్ అధికారంలోకి రావడానికే కోడికత్తి కుట్ర ఘటన- న్యాయవాది సలీమ్
'జైల్లో నా కొడుకు శ్రీను,ఇంట్లో నేను నా పెద్ద కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాం. పోలీసు అనుమతులు లేని కారణంగా విజయవాడలోని ఇంట్లోనే దీక్ష చేస్తున్నాం. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. నా కుమారుడికి న్యాయం జరగాలనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ధర్నాచౌక్‌లో దీక్షకు అనుమతి కోరితే ఇవ్వలేదు''- కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం