ETV Bharat / state

'కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలి' - కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలి

విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాత్రికేయులు నిరసన చేపట్టారు. పాత్రికేయుల హక్కులను పరిరక్షించేందుకు కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని కోరారు.

vishaka district
కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలి
author img

By

Published : Jul 9, 2020, 7:47 PM IST

పాత్రికేయుల హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం పిలుపు మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. పాత్రికేయుల భద్రతకు ముప్పు చేకూర్చే చట్టాలను ఉపసంహరించుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు.

పాత్రికేయుల హక్కులను హరిస్తూ కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్రం తాజాగా 4 ప్రొసీజర్ కోడ్ లను తెచ్చేందుకు కార్మికులకు, పాత్రికేయులకు ఉపకరించే చట్టాలను రద్దు చేసిందని శ్రీను బాబు ఆవేదన వ్యక్తం చేశారు

కరోనా మహమ్మారి వ్యాప్తిని నేపథ్యంలో మీడియా రంగం పూర్తిగా దెబ్బతిందని, పాత్రికేయులు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవికి సమర్పించారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం నగర అధ్యక్షుడు పి నారాయణ, ఈశ్వరరావు ,కే మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి 104 వాహనాన్ని ప్రారంభించిన విప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.