ఖరీఫ్‌లో పండించే ధాన్యం కొనుగోలుకు సిద్దంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2020-21కు ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పంట పండించే గ్రామాల జాబితా సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు జేసీ ఆదేశించారు. ధాన్యం సేకరణకు సంబంధించి విధి విధానాలపై అధికారులతో చర్చించారు. గ్రామాలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బేనర్లు పెట్టాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని తెలిపారు. వెలుగు సిబ్బంది, పీఎసీఎస్ గ్రూపులు వెళ్లి నాణ్యత, రికార్డ్స్, ప్రతీరోజు రిపోర్టులు అందజేయాలని సూచించారు. రైస్ మిల్లులు సిద్దంగా ఉంచాలని డీఎస్ఓ రూరల్ శివ ప్రసాద్ కు సూచించారు.
ఇవీ చూడండి...