అమాయక నిరుద్యోగుల నుంచి పలు సంస్థలు లక్షల్లో నగదు దండుకుంటున్నాయి. చెప్పేది ఒక పని... చేయించేది మరోక పని అని విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన యువకులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్ళిన వాళ్లతో చాకిరి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 12న గాజువాక ఆటోనగర్‌కు చెందిన ఓ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష 10వేలు తీసుకొని 12మందిని గల్ఫ్ పంపారు. అక్కడికెళ్లాక నరకయాతన అనుభవించి అతికష్టంగా విశాఖ చేరుకున్నామని బాధితులు చెబుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 15మంది బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు పరారయ్యారు.
ఇదీ చదవండీ...