దిల్లీలో నిరసన చేపట్టిన అన్నదాతలకు మద్దతుగా విశాఖలో కాంగ్రెస్ నేతలు చేపట్టి నిరసనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. మద్దిలపాలెం జాతీయ రహదారి పై ఆయన ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు అడ్డగించి మద్దతు ఇవ్వమని కోరగా... ఆయన సంఘీభావం ప్రకటించారు. దేశంలో రైతు బాగుండాలని, కేంద్రం మరో సారి ఈ బిల్లు పై చర్చించాలని అన్నారు. అన్నదాతల ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ...రైతులకు సంఘీభావంగా రాష్ట్రంలో భారత్ బంద్