విశాఖ జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామ సచివాలయం, సింహాద్రిపురం పంచాయతీ కార్యాలయ భవనాలను కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ఎందుకు, ఎలా ఏర్పడింది అనే అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డా. బి.సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
సచివాలయాల ఆవశ్యకత, విశిష్టతను సత్యవతి ప్రజలకు వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో.. దేశవ్యాప్తంగా రాష్టానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులను.. ఆయా గ్రామాల్లో ఊరేగింపుగా వైకాపా కార్యకర్తలు ప్రారంభోత్సవానికి తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి: