కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం.. అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను వసూలు చేస్తోందని జనసేన నేతలు ఆగ్రహించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు.. అందోళన చేపట్టారు.
స్థానిక విద్యుత్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. బిల్లుల వసూలులో ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేస్తామని అధికారులు వారికి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: