ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో భూకబ్జాకు పాల్పడినా... ప్రిన్సిపల్ స్పందించడం లేదంటూ.. జన జాగరణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాదారులతో ప్రిన్సిపల్ కలిసిపోయారని వారు ఆరోపించారు. విశాఖలోని కృష్ణ కళాశాలకు సంబంధించిన ఈ విషయంపై.. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై వెంటనే స్పందించి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సింహాద్రి వరాహ లక్ష్మీ నారసింహుడికి భారీ ఆదాయం