ETV Bharat / state

అనకాపల్లి బెల్లం మార్కెట్​లో తగ్గిన అమ్మకాలు - అనకాపల్లి బెల్లం మార్కెట్​లో తగ్గిన అమ్మకాల వార్తలు

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్​లో అమ్మకాలు తగ్గాయి. గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ కారణంగా 16 రోజుల అనంతరం తెరిచిన మార్కెట్​కు తక్కువ మొత్తంలో సరకు వచ్చిందని వ్యాపారులు తెలిపారు. సీజన్ ముగిసినందున అమ్మకాలు తగ్గినట్లు చెప్పారు.

jaggery sales decrease in anakapalli market
అనకాపల్లి బెల్లం మార్కెట్​లో తగ్గిన అమ్మకాలు
author img

By

Published : Jun 24, 2020, 9:41 PM IST

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్​లో అమ్మకాలు తగ్గాయి. కరోనా కారణంగా 16 రోజుల అనంతరం అనకాపల్లి బెల్లం మార్కెట్ బుధవారం తెరిచారు. 47 బెల్లం దిమ్మలు వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు.

గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసినందున 16 రోజుల పాటు మార్కెట్​లో లావాదేవీలు నిలిపివేశారు. నేడు మార్కెట్ తెరవటంతో పెద్దఎత్తున బెల్లం వస్తుందని ఆశించారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో.. అదీ మధ్య రకం సరకు మాత్రమే వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. సీజన్ ముగిసినందునే తక్కువగా వచ్చినట్లు రవికుమార్ చెప్పారు.

ఇవీ చదవండి...

ఉద్యానవన పంటలనాశించే తెల్లదోమపై రైతులకు అవగాహన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.